7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

Writer: Chandrika 11:39 AM, 7 సెప్టెంబర్, 2026
‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంపై హీరో అక్కినేని అఖిల్‌ ప్రశంసలు కురిపించారు. కథాబలం ఉన్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సుమంత్‌, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. లక్ష్మణ్‌, కలిపు మధు నిర్మించారు. సెప్టెంబర్‌ 11న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. అఖిల్‌, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కంటెంట్‌ను నమ్ముకుని మంచి కథను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే నేటి కమర్షియల్‌ సినిమా అని అఖిల్‌ అన్నారు. చిన్నప్పటి నుంచి సుమంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన తనపై చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. నిజాయతీతో కూడిన కంటెంట్‌ సినిమాకు సిద్ధు అండగా నిలవడం అభినందనీయమన్నారు.

దర్శకుడు సంతోష్‌ మాట్లాడుతూ సినిమాలో ప్రతి నటుడు పాత్రలను కేవలం పోషించలేదని, వాటిలో జీవించారని అన్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతంలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. సుమంత్‌ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ సమయంలో తమ వెనుక ఏదో తెలియని శక్తి నడిపిస్తోందన్న నమ్మకం ఉండేదని, సెప్టెంబర్‌ 11న ప్రేక్షకులకు తమ కష్టం కనిపిస్తుందని అన్నారు. ఫస్ట్‌హాఫ్‌ కంటే సెకండాఫ్‌, ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ చిత్రంలో సుమంత్‌, సిద్ధు మధ్య వచ్చే ఎపిసోడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. నిర్మాత మధు కారణంగానే తాను ఈ సినిమాలో భాగమయ్యానని సిద్ధు చెప్పగా, దర్శకుడు కథను అనుకున్న విధంగానే తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, అలీ, లక్ష్మణ్‌, మధు, అనూప్‌ రూబెన్స్‌, కాసర్ల శ్యామ్‌, వెనిగళ్ల రాంబాబు, మంజు భార్గవి, జెస్సీ గిఫ్ట్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

ట్యాగ్లు
మహేంద్రగిరి వారాహిసుమంత్‌అఖిల్‌ అక్కినేనిఐశ్వర్య రాజేశ్‌సిద్ధు జొన్నలగడ్డసంతోష్‌ జాగర్లపూడిఅనూప్‌ రూబెన్స్‌తెలుగు సినిమాటాలీవుడ్‌ప్రీరిలీజ్‌ వేడుక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..
సినిమాలు

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు
రాజకీయాలు

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్
రాజకీయాలు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు
జనరల్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!