

దాదాపు 20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (ఏకే47). ఈ ప్రాజెక్ట్‌పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, విడుదల తేదీ పలుమార్లు మారడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గింది. ఎట్టకేలకు ఈ చిత్రం అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ట్రైలర్‌ను విడుదల చేయనుంది. తగ్గిన బజ్‌ను మళ్లీ పెంచేందుకు ట్రైలర్ మంచి అవకాశంగా మారనుంది. ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఇప్పుడు చిత్ర బృందానికి కీలకంగా మారింది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కలయిక సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావడానికి దోహదపడవచ్చు. అయితే విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో పాటు యాక్షన్, డ్రామా అంశాలను ట్రైలర్‌లో సమర్థంగా చూపిస్తే సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో వెంకటేశ్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!