

‘సర్దార్ 2’ కోసం మాళవిక మోహనన్ చేసిన ప్రమాదకరమైన యాక్షన్ స్టంట్ ఇప్పుడు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. షూటింగ్ సమయంలో విమానం నుంచి కిందకు దూకుతున్నట్లుగా కనిపించే సన్నివేశాన్ని తెరకెక్కించినట్లు ఆమె వెల్లడించింది. ఇందుకోసం దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో కిందికి దూకాల్సి వచ్చిందని తెలిపింది.
అంత ఎత్తులో నుంచి కిందికి వస్తున్న సమయంలో చుట్టూ భారీ బ్లోయర్లతో గాలి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారట. భయాన్ని నియంత్రించుకుంటూ శరీర భంగిమను సరిగ్గా ఉంచడంతో పాటు సంభాషణలు చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని మాళవిక మోహనన్ చెప్పింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తి కథానాయకుడిగా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. భారీ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. మాళవిక చేసిన సాహసోపేతమైన స్టంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!