
సినిమాలు

కావ్య కళ్యాణ్‌రామ్–కాల భైరవ తమ ప్రేమను అధికారికంగా వెల్లడించడంతో సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విషయం మరోసారి చర్చకు వచ్చింది. కావ్య.. కాల భైరవ సోదరుడు శ్రీ సింహాతో ‘ఉస్తాద్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు కాల భైరవతో జీవితాన్ని పంచుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ విషయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదే తరహాలో గతంలోనూ కొందరు సినీ జంటలు వార్తల్లో నిలిచాయి. శ్రీదేవి–బోనీ కపూర్, శ్రియా రెడ్డి–విక్రమ్ కృష్ణ, సోనియా అగర్వాల్–సెల్వరాఘవన్ జంటలు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే ప్రతి జంట కథా నేపథ్యం భిన్నమైనదే. తమ్ముళ్లతో తెరపై జోడీగా కనిపించి, అదే కుటుంబంలోని అన్నలతో జీవిత బంధంలోకి అడుగుపెట్టిన కథలు మాత్రం ఆసక్తికరమైన సినీ విశేషాలుగా నిలుస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!