
రాజకీయాలు

ఐటెం సాంగ్స్‌తో ఒకప్పుడు యూత్‌ను ఆకట్టుకున్న నటి ముమైత్ ఖాన్, తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు గతంలో బ్రెయిన్ నర్వ్ బరస్ట్ కావడంతో తలకు తొమ్మిది టైటానియం వైర్లు అమర్చాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సర్జరీ తర్వాత తీవ్రమైన మైగ్రేన్, ఫిట్స్ వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది.
ఆరోగ్య సమస్యలు, భారీ మందుల ప్రభావం వల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని ముమైత్ వెల్లడించింది. అయితే తాను తన సక్సెస్‌లు, జీవిత సాధనలను గుర్తు చేసుకుంటూ మానసికంగా బలంగా నిలిచానని చెప్పింది. డిప్రెషన్ తాత్కాలికమని భావించి, మైండ్‌ను కంట్రోల్ చేసుకుని ముందుకు సాగినట్లు ఆమె తన అనుభవాన్ని పంచుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!