21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సఃకుటుంబానాం చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

Writer: Bhargavi 12:22 PM, 1 జనవరి, 2026
సఃకుటుంబానాం చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ కథ, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా రూపొందిన కుటుంబ చిత్రమే సఃకుటుంబానాం. ఈ సినిమా జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించగా, నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించగా, మధు దాసరి సినిమాటోగ్రఫీ, శశాంక్ మలి ఎడిటింగ్ చేశారు. ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ అయిన రామ్ కిరణ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు.

చిత్ర విడుదల సమీపిస్తున్న సందర్భంగా రామ్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, బెంగళూరులో పెరిగిన రోజుల్లో ఆ ఆసక్తి మరింత పెరిగిందని తెలిపారు. దేశంలోని అనేక చిత్ర పరిశ్రమల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, హీరో కావాలన్న కోరికతో నటన వైపు అడుగులు వేశారని చెప్పారు. సఃకుటుంబానాం కథ, ఇందులో తన పాత్ర సాధారణ హీరోల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా, సైకాలజీ టచ్‌తో ఉండటమే తనను ఆకట్టుకుందని అన్నారు. మేఘ ఆకాష్ ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి గర్వం లేకుండా తనకు సపోర్ట్ చేశారని, ఆమె నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు.

సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు గొప్ప అదృష్టమని, వారు తనకు గురువుల్లా మారారని రామ్ కిరణ్ అన్నారు. దర్శకుడు ఉదయ్ శర్మ కథ విషయంలో చాలా కచ్చితంగా, శ్రద్ధగా పనిచేశారని ప్రశంసించారు. తొలి సినిమా కావడంతో తానే కొరియోగ్రఫీ చేయకుండా ఇతర కొరియోగ్రాఫర్ల సహాయం తీసుకున్నానని చెప్పారు. మణిశర్మ సంగీతం సినిమాకు పెద్ద బలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంతమంది కుటుంబాలకు ప్రివ్యూ షోలు వేశామని, వారి స్పందన విని తన కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు. కుటుంబంతో కలిసి పిల్లలతో చూడదగిన సినిమా అని వారు చెప్పడం తనకు పూర్తి నమ్మకం ఇచ్చిందని అన్నారు. జనవరి 1 న విడుదలయ్యే ఈ సినిమా కుటుంబ విలువలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

శస్త్రచికిత్సపై అమితాబ్ భావోద్వేగ పోస్ట్

ట్యాగ్లు
సఃకుటుంబానాం సినిమారామ్ కిరణ్మేఘ ఆకాష్కుటుంబ చిత్రంతెలుగు సినిమామణిశర్మ సంగీతంజనవరి 1 విడుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం
జనరల్

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన
రాజకీయాలు

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!