

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘418’. చైత్ర జె ఆచార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాగగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా చిత్రబృందం పెయిడ్ ప్రీమియర్స్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 22, 2026న రాత్రి 10:48 గంటలకు డాల్బీ అట్మాస్ సౌకర్యం ఉన్న థియేటర్లలో మాత్రమే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్స్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ‘418’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఆసక్తికరంగా మారింది. చైత్ర జె ఆచార్తో పాటు సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్, రమేశ్ ఇంద్ర కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 22న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించిన అనంతరం, అక్టోబర్ 23, 2026న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి హారర్ సినిమా కావడంతో ‘418’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!