
జనరల్

'నాగబంధం' చిత్రంలో పార్వతి పాత్రలో నభా నటేష్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. దయ, పట్టుదల, భక్తి, బలహీనత, ఆత్మవిశ్వాసం వంటి విభిన్న భావోద్వేగాలను సహజంగా పలికిస్తూ నటిగా తన వెర్సటిలిటీని మరోసారి నిరూపించింది. ప్రతి సన్నివేశంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కథను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తున్నాయి.

దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించగా, కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించారు. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రంలో నభా నటేష్ నటనకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!