

విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 3న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. తాజాగా ‘ది ఎపిక్ బిగిన్స్ టూర్’ పేరుతో ప్రత్యేక ప్రమోషనల్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ టూర్‌లో భాగంగా జూన్ 10న సెన్సార్, జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ జరగనుంది. అనంతరం జూన్ 20 నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్ వంటి నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ సాంగ్ లాంచ్, జూన్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్, జూలై 2న ప్రీమియర్ షో ప్లాన్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!