

టాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో ఎదిగి స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని సినీ రంగ ప్రవేశం చేసి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సహజమైన నటన, విభిన్న కథల ఎంపిక, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్న నాని 18 ఏళ్ల మైలురాయిని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు, ఎడిట్స్, వీడియోలతో సెలబ్రేట్ చేశారు.
తన 18 ఏళ్ల సినీ ప్రయాణంపై నాని కూడా సోషల్ మీడియా ద్వారా సరదాగా స్పందించారు. సాధారణంగా 18 ఏళ్లు నిండితే అడల్ట్‌గా పరిగణిస్తారని, అదే విధంగా టాలీవుడ్‌లోనూ తనకు 18 ఏళ్ల వయసు వచ్చిందంటూ చమత్కరించారు. ఇన్నేళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ తేలికగా తీసుకోనని నాని తెలిపారు. తన కెరీర్‌లో అభిమానుల ప్రేమ ఎంతో కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఆ ప్రేమను గౌరవిస్తానని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!