

యంగ్ హీరో నార్నే నితిన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిదిగా గుర్తింపు పొందిన ఆయన, తన కొత్త చిత్రాన్ని హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం #NN5 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ చిత్రంలో 'బుట్టబొమ్మ' ఫేమ్ అనిఖా సురేంద్రన్, కన్నడ నటి మేఘా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
ముహూర్తపు కార్యక్రమంలో నిర్మాత వెంకట్ కె. నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!