26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార

Writer: Harika S 11:47 PM, 25 అక్టోబర్, 2026
రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ధర్మన్' గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, దర్శకుడు అశ్వత్ మారిముత్తు సోషల్ మీడియా వేదికగా ఆమెకు స్వాగతం పలికారు. దీంతో రజనీ-నయన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆదివారం సాయంత్రం 'ధర్మన్' చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తమ సోషల్ మీడియా ఖాతాలో "కొన్ని కళ్లు అన్నీ చెప్పేస్తాయి. ఆ తేజస్సు రాబోతోంది" అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొద్ది గంటలకే దర్శకుడు అశ్వత్ మారిముత్తు స్పందిస్తూ, నయనతారను ట్యాగ్ చేసి "మా టీమ్‌లోకి స్వాగతం మేమ్" అని పోస్ట్ చేయడంతో ఈ వార్త ఖరారైంది.రజినీకాంత్, నయనతార కాంబినేషన్ వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమే. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 'చంద్రముఖి' (2005), 'కుచేలన్' (2008), 'దర్బార్' (2020), 'అన్నాత్తే' (2021) చిత్రాల్లో నటించారు. ఇప్పుడు 'ధర్మన్' వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు గతంలోనే ప్రకటించారు. ఇటీవల మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొన్న నటి రాశీ ఖన్నా, రజినీకాంత్, రామ్ పోతినేనితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు. "మైసూర్‌లో ఉదయాన్నే రజనీ సార్, రామ్‌తో కలిసి వర్కౌట్లు, ఆలయాల సందర్శన, నవ్వులతో గడిపాను" అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.లోకనాయకుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. డిస్నీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో 'ధర్మన్' చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్

తెలుగులో ఇంకా పుంజుకోని సూర్య కొత్త సినిమా బజ్.. విడుదలకు ముందే సవాల్!

తెలుగులో ఇంకా పుంజుకోని సూర్య కొత్త సినిమా బజ్.. విడుదలకు ముందే సవాల్!

భార్యతో షాపింగ్ అంటే ఓపికకు పరీక్షే.. సూర్య ఫన్నీ అడ్వైస్ వైరల్!

భార్యతో షాపింగ్ అంటే ఓపికకు పరీక్షే.. సూర్య ఫన్నీ అడ్వైస్ వైరల్!

ఇరుముడి అయ్యప్ప పాటకు చిన్నారి అదిరిపోయే డ్యాన్స్.. రవితేజ స్టైల్‌లో స్టెప్పులు!

ఇరుముడి అయ్యప్ప పాటకు చిన్నారి అదిరిపోయే డ్యాన్స్.. రవితేజ స్టైల్‌లో స్టెప్పులు!

ఇడుపు కాయితం పాటపై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల

ఇడుపు కాయితం పాటపై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల

ట్యాగ్లు
రజినీకాంత్నయనతారధర్మన్తమిళ్తెలుగుసౌత్ సినిమాచంద్రముఖి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్
సినిమాలు

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార
సినిమాలు

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్
జనరల్

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్
జనరల్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు
క్రీడలు

జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్
సినిమాలు

రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ

సింగరేణి బలోపేతానికి సమగ్ర ప్రణాళిక - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి బలోపేతానికి సమగ్ర ప్రణాళిక - డిప్యూటీ సీఎం భట్టి

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ
రాజకీయాలు

ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ

కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు
జనరల్

కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

అక్టోబర్ 26న బ్యాంక్ సెలవు.. ఈ ఐదు నగరాల్లో శాఖలు బంద్!
జనరల్

అక్టోబర్ 26న బ్యాంక్ సెలవు.. ఈ ఐదు నగరాల్లో శాఖలు బంద్!

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఓ ‘లాపతా నేత’.. తెలంగాణ హామీలు ఏమయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!