
షోస్

అగ్ర కథానాయిక నయనతార తన తాజా చిత్రం “హాయ్” విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తమిళ నటుడు కవిన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేశ్ శివన్, ఎస్‌ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో నయనతార చేతిలో కత్తి పట్టుకుని నవ్వుతూ కనిపించే లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాధికా శరత్ కుమార్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!