
జనరల్

NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయం అయింది. కాలుజారి పడిపోవడంతో మోకాలికి గాయమవగా, చిత్రబృందం వెంటనే షూటింగ్ నిలిపివేసి సమీప ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి గాయం స్వల్పమైనదేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ విషయం తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని ఇద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత బాలకృష్ణ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్రబృందం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!