
సినిమాలు

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దర్శకుడు సుజీత్ అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ‘ఓజీ యూనివర్స్’ పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ‘ఓజీ’కి సీక్వెల్‌గా రాబోయే చిత్రంపై సుజీత్, పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు తమన్ మధ్య జరుగుతున్న చర్చలను చూపించారు. “ఇండియన్ ఒరిజిన్, సౌత్‌ఈస్ట్ ఎమోషన్, వెస్ట్రన్ ప్రెజెంటేషన్” అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు వీడియోలో వెల్లడించారు.
ఈ సీక్వెల్‌కు సంబంధించిన వీడియో విడుదల కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. విభిన్నమైన కథాంశం, అంతర్జాతీయ స్థాయి ప్రెజెంటేషన్‌తో ‘ఓజీ’ యూనివర్స్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!