
జనరల్

దర్శకుడు బాబీ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. సినిమా రంగంలో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. గతంలో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఆయనను కలవడానికి వెళ్తున్నప్పుడు తనలో ఉద్వేగం కలిగిందని చెప్పారు.
పవన్ కల్యాణ్‌ను ఒక ఋషిలా, త్యాగమూర్తిలా అభివర్ణించిన బాబీ, రాజకీయాల్లో ఉన్నప్పటికీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం జీవిస్తున్న వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. రాజభోగాలు వదిలి ప్రజల కోసం కష్టపడుతున్న కర్మయోగిగా ఆయనను పోల్చారు. కలిసిన సమయంలో చూపిన ఆప్యాయత తనను ఎంతో కదిలించిందని, ఆయన ఒక శిఖరంలా అనిపించారని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!