

రాకింగ్ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, తారా సుతారియా, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పలుమార్లు వాయిదాల అనంతరం ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా తారా సుతారియా మాట్లాడుతూ ‘టాక్సిక్’లో నటించడం తన కెరీర్‌లో మర్చిపోలేని అనుభవమని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు రెబెక్కా అని వెల్లడించారు. సాధారణ యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో మహిళా పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గీతూ మోహన్‌దాస్ విజన్, యష్ అంకితభావంతో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందని ప్రశంసించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని తారా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!