
జనరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' సినిమాలో రితిక నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!