
జనరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్‌ను నిరూపించుకున్నారు. జూన్ 2026కు సంబంధించి ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన ‘స్టార్స్ ఇండియా లవ్స్’ జాబితాలో ప్రభాస్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భాషలు, ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొందుతూ ఆయన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వరుస భారీ చిత్రాలతో ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ జోరులో ఉన్నారు.
‘బాహుబలి’ సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ప్రభాస్, ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి విజయాలతో తన మార్కెట్‌ను మరింత విస్తరించారు. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయనకు విశేష ఆదరణ ఉంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దేశంలో అత్యంత బ్యాంకబుల్ స్టార్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!