

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్పై కొంతకాలంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, ‘గాడ్ ఆఫ్ వార్’ అనేది సినిమా అధికారిక టైటిల్ కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా టైటిల్పై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
మీడియా సమావేశంలో ఈ టైటిల్పై స్పందించిన నాగవంశీ, సినిమాలోని ఓ ప్రత్యేక సన్నివేశం లేదా సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించే అవకాశం ఉండవచ్చని, అయితే దానిని సినిమా ప్రధాన టైటిల్గా పరిగణించకూడదని వివరించారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి పనిచేయనున్న ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా అసలు టైటిల్పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమ అభిమాన హీరో కొత్త చిత్రానికి ఎలాంటి పేరు ఖరారు చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!