
సినిమాలు

‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనౌన్స్మెంట్ తర్వాత పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఆసక్తి తగ్గిన సమయంలో తాజాగా కీలక అప్డేట్ వెలువడింది.
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫిల్మ్ ఫ్యాక్టరీలో సినిమా తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జులైలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ షూటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే అధికారిక విడుదల ప్రకటనతో పాటు ప్రమోషన్స్ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!