

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ను హైదరాబాద్లో నేటితో ముగించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటివరకు విడుదలైన పాత్ర పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రలపై ఆసక్తిని పెంచాయి.
షూటింగ్ పూర్తవడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!