

వరుస పరాజయాల తర్వాత కొంత విరామం తీసుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈసారి సస్పెన్స్, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘టార్టాయిస్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గత రెండు రోజులుగా ‘నిద్రలో నడిచే ఆ యంగ్ హీరో ఎవరు?’ అంటూ అవసరాల శ్రీనివాస్ చేసిన ప్రమోషన్లతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి ఈ సస్పెన్స్‌కు తెరదించారు. వెరైటీ టైటిల్‌తో వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఫస్ట్ లుక్‌లో రక్తపు మరకలతో ఉన్న రాజ్ తరుణ్ ఓ మృతదేహం పక్కన కూర్చొని కనిపించడం, అతని సమీపంలో కత్తితో పాటు తాబేలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. “రాత్రి మొదలైతే అతడి కథ మొదలవుతుంది.. నిద్రలో నడిచే అతడి అడుగులు ఎటు దారితీస్తాయో?” అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతోంది. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశ్వితా ఎంటర్‌టైన్‌మెంట్స్, NVL క్రియేషన్స్, SK గోల్డెన్ ఆర్ట్స్ పతాకాలపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!