

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ ‘టార్టాయిస్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశ్వితా ఎంటర్‌టైన్‌మెంట్స్, NVL క్రియేషన్స్, SK గోల్డెన్ ఆర్ట్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఇందులో భాగంగా ‘నీ పరిచయం...నీ పరిచయం’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ప్రకటించారు. ఈ మెలోడీ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ స్వరాలు అందించగా, ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు. ఈ అప్‌డేట్‌తో పాటు రాజ్ తరుణ్, అమృత చౌదరి వర్షంలో తడుస్తూ రొమాన్స్ చేస్తున్న అందమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!