

భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్, రజినీకాంత్ తమకున్న అపారమైన అభిమాన బలాన్ని మరోసారి చాటుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 4 సినిమాల చొప్పున కలిగి ఉన్న భారతీయ తారలుగా వీరిద్దరూ ప్రత్యేక గుర్తింపు పొందినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఖాతాలో బాహుబలి, బాహుబలి 2, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలు ఉన్నాయి. భారీ వసూళ్లతో ఈ సినిమాలు ఆయన మార్కెట్ స్థాయిని మరింత పెంచాయి.
మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు 2.0, జైలర్, కూలీ, జైలర్ 2 చిత్రాలు ఈ జాబితాలో నిలిచారు. ముఖ్యంగా జైలర్ 2 చేరికతో ప్రభాస్ సాధించిన 4 చిత్రాల మైలురాయిని రజినీకాంత్ కూడా సమం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం, భారీ వసూళ్లు సాధించే శక్తి ఈ ఇద్దరు అగ్రతారల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. వారి తదుపరి చిత్రాలు కూడా ఇదే స్థాయిలో రాణిస్తాయా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!