
జనరల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమాకు గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకున్న సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు చిత్ర బృందాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
అత్యుత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైన కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన రామ్ చరణ్, తన సోదరి నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీతో పాటు మొత్తం యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!