
జనరల్

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై అంచనాలు పెరుగుతున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చిత్రబృందం విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘రణబాలి’ రఫ్ కట్ నిడివి 3 గంటల 20 నిమిషాలు ఉండేదని, ఎడిటింగ్ తర్వాత దాన్ని 2 గంటల 50 నిమిషాలకు తగ్గించినట్లు వెల్లడించారు.
దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో, ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేసే బలమైన స్క్రీన్ప్లే ఈ సినిమాకు కీలకం కానుంది. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. కథనం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందన్నది సినిమా ఫలితంపై ప్రభావం చూపనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!