

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ భావోద్వేగ కుటుంబ కథలో రవితేజ తన కెరీర్లో తొలిసారి చిన్నారికి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘అయ్యప్ప పడి పూజ’ పాట సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రవితేజతో పాటు బేబీ నక్షత్ర కూడా తమ పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. మరో మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, అనంతరం చిత్రీకరణ పూర్తికానుంది. ఆగస్ట్ 21 విడుదల లక్ష్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఇప్పటికే రీ-రికార్డింగ్ పనులు ప్రారంభించగా, త్వరలో రెండో పాటను కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!