
షోస్

మాస్ మహారాజ రవితేజ, ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. బలమైన భావోద్వేగాలకు అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తొలి వారం నుంచే మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో బుకింగ్స్ పరంగా సినిమా సత్తా చాటుతోంది.
ఈ వారం పలు సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, వాటిలో ఏదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేంత బజ్‌ను క్రియేట్ చేయలేదు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్‌గా మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!