

బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన రాజా శివాజీ సినిమా సక్సెస్ సాధించగా, సక్సెస్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి ఆయన డ్యాన్స్ చేయడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది.
ఈ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ టీషర్ట్ ధరించానని, ఈవెంట్‌కు వెళ్లే సమయంలో దుస్తులు మార్చుకునే అవకాశం లేకపోయిందని తెలిపారు. మద్యం తీసుకున్నాననే ఆరోపణలను కూడా ఆయన ఖండిస్తూ, తన జీవితంలో ఎప్పుడూ మద్యం తీసుకోలేదని చెప్పారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. ఈ చిత్రం సుమారు ₹117.41 కోట్ల గ్రాస్ వసూళ్లతో మరాఠీ సినిమా చరిత్రలో రికార్డు సృష్టించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!