
రాజకీయాలు

సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి త్వరలో భారీ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా సాయిపల్లవి, నటుడు జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ టాక్ షోలో పాల్గొని తన కెరీర్ తొలినాళ్ల అనుభవాలను పంచుకున్నారు.
తన డాన్స్ ప్రయాణం ప్రారంభంలో ఓ ప్రముఖ డాన్స్ రియాలిటీ షోలో ఓటమి ఎదురైందని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత అదే వేదికపై ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీలో ‘రౌడీ బేబీ’ పాటకు నృత్యం చేయడం తన జీవితంలో మర్చిపోలేని మలుపుగా నిలిచిందని చెప్పారు. విజయం కేవలం అదృష్టం వల్లే రాదని, కష్టపడి పనిచేస్తేనే ఆశించిన స్థాయికి చేరుకోగలమని ఆమె అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!