

యువ హీరో సంగీత్ శోభన్ వరుస విజయాలు, సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘రాకాస’ వంటి చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన.. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘ప్రొడక్షన్ 3’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెప్టెంబర్ 6న టైటిల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంగీత్ శోభన్, అనస్వర రాజన్ కలిసి ఉన్న కలర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పల్నాటి సూర్యప్రతాప్ మార్క్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ తోడైతే సినిమా మంచి వినోదాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!