

టీమ్ ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని. తాజాగా ఆయన నటించిన జైలర్ 2 సినిమాను చూసేందుకు సంజు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నట్లు వెల్లడించాడు. సినిమా విడుదలైన రోజే చూడాలని భావించినప్పటికీ, దిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరుకావడంతో అది సాధ్యం కాలేదని తెలిపాడు. రజనీకాంత్ సినిమాలు చూడటం తనకు ఎంతో ఇష్టమని, ఆయన తదుపరి చిత్రాల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తానని సంజు చెప్పాడు. సాధ్యమైనంతవరకు రజనీ సినిమాలను తొలిరోజే చూడటానికి ప్రయత్నిస్తానని, ఈసారి మాత్రం ఒక రోజు ఆలస్యంగా సినిమా చూడాల్సి వచ్చిందని వివరించాడు.
తర్వాత థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకుని తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జైలర్ 2ను వీక్షించినట్లు సంజు వెల్లడించాడు. తమ జట్టులో తమిళం తెలిసిన సపోర్టింగ్ స్టాఫ్ సభ్యులు కూడా ఈ సినిమా చూసేందుకు వచ్చారని తెలిపాడు. బిగ్స్క్రీన్పై రజనీకాంత్‌ను చూడటం ఎంతో ఆనందాన్నిచ్చిందని తన సంతోషాన్ని పంచుకున్నాడు. క్రికెట్ మైదానంలో తన ఆటతో అభిమానులను అలరించే సంజు, ఇలా తన అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను చాటుకోవడం ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!