

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సర్దార్ 2’కు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. విజయవంతమైన ‘సర్దార్’కు సీక్వెల్‌గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఓ మిషన్ చుట్టూనే కథను నడిపించే ప్రయత్నం చేసింది. పాటలు, అనవసరమైన కమర్షియల్ అంశాలు, ఇతర దృష్టి మళ్లించే ఎపిసోడ్లకు దూరంగా కథను నేరుగా చెప్పడం మంచి ప్రయత్నమే. అయితే లాజిక్‌కు దూరంగా ఉండే సన్నివేశాలు, మోతాదుకు మించిన యాక్షన్ సినిమాకు ప్రతికూలంగా మారాయి. సీరియస్‌గా ఉండాల్సిన కొన్ని సన్నివేశాలు కూడా అతిగా చూపించిన యాక్షన్ కారణంగా సిల్లీగా అనిపిస్తాయి.
కార్తీ పోషించిన సీనియర్ సర్దార్ పాత్ర చుట్టూ వచ్చే కీలక బ్లాక్స్ కూడా ఆశించిన స్థాయిలో పండలేదు. ప్రతినాయకుడిగా నటించిన ఎస్.జే. సూర్య తన నటనతో బలమైన ఇంపాక్ట్ చూపించాల్సి ఉండగా.. ఎక్కువగా అరుపులు, గోలకే పరిమితమైనట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో నెమ్మదిగా సాగే డ్రామాను భరించిన ప్రేక్షకులు సెకండాఫ్‌లో అయినా ఉత్కంఠభరితమైన కథనం ఉంటుందని ఆశిస్తారు. కానీ కీలకమైన ద్వితీయార్ధం కూడా బలహీనంగా ఉండటంతో సినిమా ఆశించిన స్థాయిలో థ్రిల్‌ను అందించలేకపోయింది. మంచి మిషన్ కాన్సెప్ట్‌ను బలమైన స్క్రీన్‌ప్లే, ప్రభావవంతమైన ఎగ్జిక్యూషన్‌తో తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!