

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ మోస్ట్ వాటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీయ శరణ్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఈ ఏడాది ‘మిరాయ్’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తన తొలి పరిచయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఓ రోజు దర్శకుడు శంకర్ తనకు ఫోన్ చేసి సినిమాలో నటిస్తారా అని అడిగారని శ్రీయ తెలిపింది. తాను ఓకే చెప్పడంతో ఆఫీస్‌కు రమ్మన్నారని, అక్కడికి వెళ్లినప్పుడు ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, సినిమాటోగ్రాఫర్ కె.వి. ఆనంద్ వంటి ప్రముఖులు కనిపించారని చెప్పింది. దీంతో ఏదో భారీ సినిమా గురించి చర్చ జరుగుతోందని అనుకున్నానని తెలిపింది. ఆ సమయంలో శంకర్ తన కో-స్టార్ రజనీకాంత్ అని చెప్పడంతో షాక్ అయ్యానని శ్రీయ గుర్తుచేసుకుంది. అలా ‘శివాజీ’ సినిమా ప్రాజెక్ట్ మొదలైందని, ఆ సినిమా ఎంత పెద్దదో అప్పటివరకు తనకు తెలియదని చెప్పింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!