4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

Writer: Pooja 10:59 AM, 4 సెప్టెంబర్, 2026
అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘అరసన్’. వెట్రిమారన్ సృష్టించిన ‘వడ చెన్నై’ యూనివర్స్ నేపథ్యంలో ఈ సినిమాను స్టాండ్‌అలోన్ గ్యాంగ్‌స్టర్ కథగా రూపొందిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఆండ్రియా జెర్మియా కథానాయికలుగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న శింబు ‘అరసన్’పై కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని, తన పాత్ర యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు సాగుతుందని తెలిపారు. కథకు అనుగుణంగా 5 నుంచి 6 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూడు గెటప్‌లకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. వెట్రిమారన్ నాణ్యత, వాస్తవికతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో షూటింగ్‌కు సమయం పడుతోందని శింబు తెలిపారు. ఈ సినిమా 2027 పొంగల్‌కు విడుదల కావడం లేదని స్పష్టం చేస్తూ, అభిమానులను గర్వపడేలా చేసే చిత్రాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో ప్రత్యేకమైన ‘వరల్డ్ ఆఫ్ అరసన్’ కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

ట్యాగ్లు
అరసన్శింబువెట్రిమారన్విజయ్ సేతుపతిఅనిరుధ్ రవిచందర్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!