

కార్తీ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్దార్ 2’ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నటుడు ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో స్టైలిష్ విలన్‌గా కనిపించిన ఎస్జే సూర్య లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలిరంగు సూట్‌తో పాటు పోస్టర్లో కనిపించిన డ్రాగన్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ స్పై థ్రిల్లర్‌ను ఎస్. లక్ష్మణ్ కుమార్, ఈషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు కార్తీ, ఎస్జే సూర్య మధ్య సాగే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!