
సినిమాలు

టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా నటుడు శ్రీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయసు పెరుగుతున్నా శ్రీకాంత్ అందం ఏమాత్రం తగ్గడం లేదని, కఠినమైన డైట్ లేదా జిమ్ అవసరం లేకుండా ఫిట్‌గా ఉంటారని పేర్కొన్నారు.
ఇండియాలో కడుపునిండా తింటూనే ఇంత ఫిట్‌గా ఉండే హీరోలు చాలా అరుదని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో లయ సరసన నటిస్తున్నారు. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 17 న విడుదల కానుంది. మరోవైపు వినాయక్ ‘చత్రపతి’ హిందీ రీమేక్ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!