6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

Writer: Chandrika 04:54 PM, 6 సెప్టెంబర్, 2026
హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వెండితెరకు పరిచయమైన సుమంత్‌.. హీరో పాత్రలతో పాటు ప్రత్యేక పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. చిన్నతనంలో తన తల్లిదండ్రులు అమెరికా వెళ్లిన సమయంలో తాత అక్కినేని నాగేశ్వరరావు తనను దగ్గరికి తీసుకుని కొడుకులా చూసుకున్నారని సుమంత్‌ గుర్తుచేసుకున్నారు. మంచిచెడులు చెప్పడంతో పాటు చదువు, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు. తాతగారి ప్రభావంతోనే సినిమాల్లోకి రావాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ తన తొలి సినిమా కాగా, ఆ తర్వాత ‘సత్యం’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. షూటింగ్‌ లేని సమయంలో వారానికి కనీసం రెండుసార్లు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం తనకు ఇష్టమని, సాధారణ రోజుల్లో ముఖానికి మాస్క్‌ ధరించి మరీ మార్నింగ్‌ షోలకు వెళ్తానని వెల్లడించారు.

సినిమాలే తన ప్రపంచమని చెప్పిన సుమంత్‌.. కథలు నచ్చకపోవడంతోనే మధ్యమధ్యలో కెరీర్‌లో విరామాలు వచ్చాయని తెలిపారు. సినిమాలు చేసినా, చేయకపోయినా కథలు వింటూనే ఉంటానని, నచ్చిన కథను మాత్రమే ఎంచుకుంటానని చెప్పారు. తాను విని చేయకుండా వదులుకున్న ‘నువ్వే కావాలి’, ‘దేశముదురు’ చిత్రాలు విజయవంతం కావడం గురించి కూడా ప్రస్తావించారు. ‘సీతారామం’ తర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే విలన్‌ పాత్రల్లోనూ నటిస్తానని చెప్పారు. తన మామ నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో నటన, డైలాగ్‌ డెలివరీ విషయంలో సూచనలు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. మహేశ్‌బాబు తనకు మంచి మిత్రుడని, ఆయన తన ఫేవరెట్‌ హీరో అని చెప్పారు. తాను ఇంట్రావర్ట్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇష్టం ఉండదని, సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటానని సుమంత్‌ వెల్లడించారు. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ట్యాగ్లు
సుమంత్‌ అక్కినేనిసుమంత్‌అక్కినేని కుటుంబంఅక్కినేని నాగేశ్వరరావునాగార్జునమహేశ్‌బాబుమహేంద్రగిరి వారాహితెలుగు సినిమాసుమంత్‌ ఇంటర్వ్యూటాలీవుడ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..
జనరల్

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌
సినిమాలు

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..
జనరల్

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..
జనరల్

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...