

రాజు వెడ్స్ రాంబాయి చిత్ర విజయంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయిలు కాంపటి తన రెండో సినిమాను అధికారికంగా ప్రకటించారు. మేమ్ ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా ‘బబ్లూ XXL’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రంగురంగుల ఫ్లోరల్ షర్ట్, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు విక్టరీ సింబల్ చూపిస్తూ సుమంత్ ప్రభాస్ ఉత్సాహభరితమైన లుక్‌లో కనిపిస్తున్నారు. మంచిర్యాల నేపథ్యంలో సాగే ఈ చిత్ర పోస్టర్‌లో అక్కడి క్లాక్ టవర్, రాతి వంతెన, ఆలయ నిర్మాణాలను చూపించడం ద్వారా స్థానిక వాతావరణాన్ని ప్రతిబింబించారు.
ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సరసన గహాజీ ఎస్కే కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, వాజిద్ బేగ్ ఛాయాగ్రహణం, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎల్లాపు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని జెన్-జీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!