
సినిమాలు

టాలీవుడ్ యువ నిర్మాత నాగ వంశీకి అనుకోని లాభాలు దక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఆయనకు ఇటీవల కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే తమిళ నటుడు సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయనకు మంచి లాభాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో సూర్య తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో నాగ వంశీకి అనుకోని అదృష్టం కలిసి వచ్చిందని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!