

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సీన్’. ‘ఆవేశం’ సినిమాతో గుర్తింపు పొందిన జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య కెరీర్‌లో ఇది 47వ సినిమా. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో డీఎస్పీ ప్రేమ్ రాజ్‌గా సూర్య కనిపించిన తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభించింది. తాజాగా రెండో పాట ‘ఎయిర్‌ప్లేన్’ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!