
సినిమాలు

టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ ఎంతోకాలం క్రితమే ప్రారంభించిన స్వయంభు చిత్రం ప్రస్తుతం పూర్తి దశకు చేరుకుంది. భారీ గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు ఎక్కువ సమయం తీసుకోవడంతో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ వారంలో ఫస్ట్ కాపీ సిద్ధం కానుండగా, ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంపై నిఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!