
జనరల్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘యేశనగుల’, ‘ఆయా షేర్’ పాటలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ రెండు పాటలు కలిపి యూట్యూబ్‌లో 313 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాయని చిత్రబృందం వెల్లడించింది.
పాటలకు వస్తున్న భారీ స్పందనతో ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’కు వచ్చిన స్పందన నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!