
సినిమాలు

తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష 43 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సూర్యతో నటించిన ‘కరుప్పు’ సినిమా విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష తన ముద్దు పేర్లను బయటపెట్టింది. తనను కొందరు “హనీ”, “ట్రాష్” అని పిలుస్తారని ఆమె చెప్పింది. “హనీ” అనే పేరు తన అమ్మ మాత్రమే పిలుస్తుందని, అది తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాగే కాలేజీ రోజుల్లో తన స్నేహితులు “ట్రాష్” అనే పేరు పెట్టారని, ఇప్పటికీ వారు అలా పిలిస్తే చాలా సంతోషంగా ఉంటుందని త్రిష వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!