

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న హీరోగా కొనసాగుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒకేసారి ఒక్క సినిమాపైనే దృష్టి పెట్టగా, ప్రభాస్ మాత్రం ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ హైదరాబాద్‌లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా, ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’ కూడా భారీ సెట్లలో కొత్త షెడ్యూల్‌తో కొనసాగుతోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూడు చిత్రాల్లో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ అధికారి, ‘కల్కి 2’లో భవిష్యత్ ప్రపంచ యోధుడు, ‘ఫౌజీ’లో పీరియాడిక్ పాత్రలో నటిస్తున్నారు. వేర్వేరు గెటప్‌లు, బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాలను సమతూకంగా ప్రదర్శిస్తూ షూటింగ్ పూర్తి చేయడం ప్రభాస్ అంకితభావానికి నిదర్శనమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!