

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లోని కోటా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు బీహార్‌కు చెందినవారని తెలుస్తోంది. ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం జరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘటనలో నటుడు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అనుమానితులను గుర్తించారు. తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తుల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. నిందితుల కోసం ముంబైలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వచ్చిన సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. అయితే నిందితుల పూర్తి వివరాలు, కాల్పుల వెనుక ఉద్దేశం, ఘటనలో వారి పాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!