

ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ‘‘టైగర్ అనే పేరు ఎంతమందికైనా ఉండొచ్చు. కానీ, సినీ పరిశ్రమలో ఒక్కరే టైగర్.. ఆయనే సల్మాన్ ఖాన్’’ అని ష్రాఫ్ వ్యాఖ్యానించినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యల కారణంగానే నటుడిని లక్ష్యంగా చేసుకున్నామని అతడు చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. మరోవైపు, కేసుకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటివరకు ఆరు బ్యాంకు ఖాతాలను గుర్తించి పరిశీలిస్తున్నట్లు సమాచారం. నగదు నిందితులకు నేరుగా కాకుండా మూడు వేర్వేరు దశల్లో చేరినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో ప్రయాణిస్తుండగా నిందితులను అరెస్ట్ చేసినట్లు గతంలో వెల్లడైంది. కాల్పుల అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వారు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారని, కమ్యూనికేషన్ కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) సేవలను ఉపయోగించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సినిమా షూటింగ్ సెట్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, సరైన గుర్తింపు లేని వ్యక్తులను సిబ్బందిగా నియమించవద్దని సూచించింది. కాల్పుల కేసులో ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!