

ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్న చిత్రం ‘ఒడిస్సి’. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించగా, విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా భారతదేశంలోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజువల్స్, కథనం, సాంకేతిక నైపుణ్యం పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నోలన్ తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూయిజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ‘ఒడిస్సి’ని వీక్షించిన ఆయన, నోలన్ పనితీరును ప్రశంసిస్తూ చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ అద్భుతమైన పని చేశారని పేర్కొంటూ, ఈ చిత్రం తనకు మరపురాని అనుభూతిని అందించిందని వెల్లడించారు. ఒకసారి చూసి ఆగిపోలేనంత స్థాయిలో సినిమా ఆకట్టుకుందని, మరోసారి తప్పకుండా చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇటీవల ‘డిగ్గర్’ ట్రైలర్‌తో వార్తల్లో నిలిచిన టామ్ క్రూయిజ్ నుంచి వచ్చిన ఈ స్పందనతో ‘ఒడిస్సి’పై ఆసక్తి మరింత పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!