

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో సస్పెన్స్, డ్రామాతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా, తాజాగా ‘నీ పరిచయం..’ పాటను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.
పాట విడుదల కార్యక్రమంలో హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ.. ‘నీ పరిచయం’ పాట ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ పాటను రావులపాలెంలో చిత్రీకరించామని, అక్కడ షూటింగ్ సమయంలో స్థానికులు ఎంతో ఆప్యాయంగా ఆదరించారని చెప్పారు. వారు బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారని, వారి నిస్వార్థ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. కంపోజర్ అనూప్ అద్భుతమైన పాటను అందించారని ప్రశంసించిన అమృత సినిమాకు కూడా ప్రేక్షకుల మద్దతు కొనసాగించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!